తెలంగాణ ప్రభుత్వం రేపు అమలు చేయబోయే నాలుగు ప్రభుత్వ పథకాల కోసం గ్రామ, వార్డు సభల ద్వారా అర్హులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, అర్హుల ఎంపిక సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల గ్రామ, వార్డు సభల్లో గందరగోళం నెలకొంది.
ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిన మేరకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని పేద ప్రజలు డిమాండ్ చేశారు. కొందరు తమకు పేర్లు ఫైనల్ లిస్టులో లేవని ఆందోళనకు దిగారు. మొత్తానికి
4 రోజుల పాటు గ్రామసభలు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల 774 గ్రామాల్లో సభలు ముగిశాయి.
రేపటి నుంచి ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు సర్వే చేయనున్నారు. లబ్ధిదారులపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే తిరిగి అధికారులు ఎంక్వైరీ చేయనున్నారు.