ప్లాన్ ప్రకారమే ఆ సినిమాలో తన సీన్లను తీసేసారం టున్న నటుడు పృథ్వి..!!

-

రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత అద్భుతమైన నటనను అందించింది. రామ్ చరణ్ కెరీర్లో ఈ సినిమా ప్లస్ గా మారింది. ఈ చిత్రం పాత్రలు, కథ ప్రతి ఒక్క ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. అయితే రంగస్థలం సినిమా గురించి ఈ విషయాలు అందరికీ తెలిసినవే కానీ ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ రంగస్థలం సినిమాల ప్రముఖ కమెడియన్ అయిన పృథ్వి రాజ్ కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటించారు. వారం రోజుల పాటు షూటింగ్ లో పాల్గొని తన పాత్రను పూర్తి చేసినట్లుగా తెలియజేశారు.. తన పాత్రకు డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్లుగా తెలియజేశారు అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ పృథ్విరాజ్ పాత్రను ఎడిటింగ్లో తొలగించేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. తను నటించిన ఏ సీను కూడా ఇందులో కనిపించలేదట. అయితే డబ్బింగ్ చెప్పిన తరువాత తన పాత్రను ఎందుకు తొలగించారు అనేది ఆయన ప్రశ్న..అయితే ఈ విషయంపై ఆయనకి కొంతమంది తెలియజేసిన విషయం ప్రకారం.. సుకుమార్ ఫ్రెండు ఎవరో అమెరికాలో ఉన్నారట. ఆయన సుకుమార్ కు ఫోన్ చేసి మీరు పృథ్వీరాజు ఎందుకు మీ సినిమాలో పెట్టుకున్నారు ఆ సినిమాలో కనుక అయిన ఉంటే రావు గోపాల్ రావు అయిపోతారని చెప్పారట. ఈ కారణంగానే పృథ్వి రాజ్ నటించిన సన్నివేశాలను తొలగించి నటిగా తనకు సమాచారం వచ్చిందని తెలియజేశారు పృథ్వి రాజ్. ఈ సినిమాతో అనసూయ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version