IQoo నుంచి 10 సిరీస్‌లో లాంచ్‌ కానున్న రెండు ఫోన్లు..!

-

ఐకూ నుంచి 10 సిరీస్‌ ఫోన్లను లాంచ్‌ చేసేందుకు కంపెనీ రెడీ అయింది. ఐకూ 10, ఐకూ 10 ప్రో స్మార్ట్‌ ఫోన్లను వచ్చే నెలలో లాంచ్‌ కానున్నాయి. ఈ ఫోన్లకు సంబంధించి కొంత సమాచారం ఇప్పటికే లీక్‌ అయింది. డిజిటల్ చాట్ స్టేషన్ అనే ఐడీ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో ఈ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉందట.. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో ఎంట్రీ ఇచ్చిన మొదటి ఫోన్లలో ఐకూ 9 ప్రో ఒకటి. జనవరిలోనే ఈ ఫోన్ మార్కెట్లో అడుగుపెట్టింది.ఐకూ 10 సిరీస్‌లో ఎస్ఈ మోడల్ ఉంటుందో లేదో ఇంకా తెలియరాలేదు.
ఐకూ 9 సిరీస్‌లో ఈ ఎస్ఈ మోడల్‌ను అందించారు. కానీ ఈ ఐకూ 9 ఎస్ఈ కేవలం మనదేశంలో మాత్రమే లాంచ్ అయింది. ఐకూ 10 గురించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు.
అయితే ఐకూ 10 ప్రో గురించి కొన్ని వివరాలు లీకయ్యాయి. దాని ప్రకారం ఈ ఫోన్‌లో 2కే అమోఎల్ఈడీ ఎల్టీపీవో డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ఇందులో ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉండనుందట.
మనదేశంలో ఐకూ నియో 6 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర రూ.29,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా నిర్ణయించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 80W ఫ్లాష్ చార్జ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 6.62 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, 4700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.
ఇంకా ఐకూ 10 సిరీస్‌ ధరలను కంపెనీ చెప్పలేదు. ముందు విడుదలైన వర్షన్స్‌ బట్టి.. వీటి ధర కూడా దాదాపు అదే రేంజ్‌లో ఉంటుందని అంచనా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version