Ram Charan: స్టైలిష్ రామ్ చరణ్..RC15లో మెగా పవర్ స్టార్ లుక్స్‌పై డైరెక్టర్ ఫుల్ ఫోకస్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..ప్రస్తుతం ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రామ్ చరణ్ కు సంబంధించిన పలు ఫొటోలు లీక్ అయ్యాయి. ఇందులో మెగా పవర్ స్టార్ మూడు పాత్రలను పోషిస్తారని తెలుస్తోంది.

ఒక పాత్రలోని రామ్ చరణ్ లుక్ చాలా యంగ్ గా ఉండాలని దర్శకుడు శంకర్ హీరోకు చెప్పారట. ఈ విషయమై శంకర్ ఫుల్ ఫోకస్ పెట్టేశారని వినికిడి. టెంపర్ మెంట్ ఉన్న యువకుడి పాత్రలో రామ్ చరణ్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట బాగా వైరలవుతోంది. పొడవాటి జుట్టు, గాగుల్స్ ధరించిన రామ్ చరణ్ ..చాలా స్టైలిష్ గా కనబడుతున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఓ లుక్ లో రామ్ చరణ్ పంచ కట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ వెళ్తు్న్నాడు. అది కచ్చితంగా పొలిటీషియన్ లుక్ అని అభిమానులు, నెటిజన్లు చర్చించుకుంటున్నారు. RRR తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ RC15 కాగా, ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ మ్యూజిక్ డైరెక్టర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version