అచ్చెన్న రేపిన కొత్త అలజడి… ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులను అలా చేశారా?

-

ఆంధ్రప్రదేశ్ లో రసవత్తర రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ పై గగ్గోలు పెడుతోంది టీడీపీ. ఈఎస్‌ఐ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై పక్కా ఆధారాలతో అచ్చెన్నాయుడిని.. సంబంధిత అధికారులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న ఏసీబీపై అవాకులు చవాకులు పేల్చుతున్నారు టీడీపీ నేతలు! అచ్చెన్నాయుడు అరెస్ట్ అక్రమమని.. కాబట్టి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వినమ్రంగా హైకోర్ట్ ను ఆశ్రయించారు అచ్చెన్నాయుడు.

అంతేకాకుండా గుంటూరు జనరల్ ‌ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు విచారించారని.. దీంతో కస్టడీ ముగిసిపోవడంతో ఇక బెయిల్ మంజూరు చేయడమే ఆలస్యమని హైకోర్ట్ ని తొందరపెట్టేలా పిటిషన్ లో పేర్కొన్నారు. అంటే ఇక విచరాణ అయిపోయింది కాబట్టి త్వరత్వరగా బెయిల్ ఇచ్చేసెయ్యండి అంటూ దబిడిదిబిడి వ్యవహారంలా న్యాయస్థానంలో పిటిషన్ వేయడం చూస్తుంటే వీరి ఆతృత ఏపాటిదో అట్టే అర్థమౌతుంది.

ఈ సంగతి అలా ఉంటే… గత నెల 16వ తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా అచ్చెన్నాయుడిని కావాలని అడ్డుకొనేందుకు అరెస్ట్ చేశారని.. అంతే తప్ప ఆ కేసులో ఎలాంటి పసలేదనే విషయం కూడా ఫిర్యాదులో పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశగా పేర్కొనడాన్ని చూసే ప్రజలు కూడా విస్తపోతున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… అదే నెల 19వ తేదీన జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసేందకు అధికార పార్టీ పన్నిన పన్నాగంలో భాగంగా కక్షగట్టి అరెస్ట్ చేశారని..కూడా పేర్కొనడం నిజంగా విడ్డూరమే.

అయితే అసలు నిజంగా అచ్చెన్నాయుడు బయట ఉండి రాజ్యసభకు ఓటు వేసినంత మాత్రాన టీడీపీ నిలబెట్టిన వర్ల రామయ్య రాజ్యసభ సభ్యుడిగా గెలుసిండేవారా? అనేది వేయిడాలర్ల్ ప్రశ్నగా ఏపీ ప్రజానీకాన్ని వేధించేస్తుంది. గెలవలేరని తెలిసినప్పటికీ… కులాలతో రెచ్చగొట్టి రాజకీయ కలవరపాటును సృష్టించాలనే ఓ రకమైన ఎత్తుగడలో భాగంగా బాబు పెట్టిన పన్నాగంలో వర్లరామయ్య మరోసారి బలి కాబోతున్నాడు అనేది మొదటి నుంచీ నడుస్తోన్న తతంగమే. అందుకు అచ్చెన్నాయుడు వచ్చి ఓటు వేసినంత మాత్రాన వర్లరామయ్య రాజ్యసభకు వెళ్లలేరనేది సుస్పష్టం.

ఇక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సీఎం జగన్‌ఆదేశాల మేరకు తనను అక్రమ కేసులో ఇరికించారని కూడా పిటిషన్ లో పేర్కొనడం నిజంగా విడ్డూరమే. ఏసీబీ తనపని తాను చేసుకుపోతుందని… అక్రమార్కుల భరతం వైఎస్ జగన్ పట్టుబోతుందని.. తొలి నుంచీ చెప్పి మరీ చేస్తున్న విషయం బహిరంగ రహస్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని.. అన్ని అంశాలు లెక్కలోకి తీసుకొని తనకు బెయిల్‌మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు హైకోర్టును అభ్యర్థించారు.

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా దాగి ఉంది. మెరుగైన వైద్యం కోసం గుంటూరు లేదా విజయవాడ నగరాల్లోని ఏదైనా కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరి.. తన సొంత ఖర్చుతో చికిత్స చేయించుకొనేందుకు అనుమతించాలని కూడా అచ్చెన్నాయుడు గతంలో కోర్టును అభ్యర్థించారు. ఆ పిటిషన్‌ పై న్యాయమూర్తి జస్టిస్‌కె.లలిత ముందు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును బుధవారానికి వాయిదా వేసింది కోర్ట్.

అయితే ఈ విషయంలో ప్రజలకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు వద్దు ప్రైవేటు ఆసుపత్రులు ముద్దు అంటున్న అచ్చెన్నాయుడు.. గత ఐదేళ్ల తమ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేశారా? అనే అనుమానాలు ప్రజలను పీడిస్తున్నాయి. అత్యంత సెక్యూరిటీ మధ్యలో ప్రత్యేకంగా మాజీ మంత్రి హోదాలో అచ్చెన్నాయుడి అద్భుతమైన వైద్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం ఆసుపత్రులను చులకన చేయడమే ఈ అచ్చెన్నాయుడి అభ్యర్థనకు నిదర్శనం అంటూ ప్రజల మదిలో కొత్త ఆలోచన రేపారు. మరి చూడాలి. దీనిపై రేపు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version