బిగ్ న్యూస్: అచ్చెన్నకు అధ్యక్ష పదవి వద్దంట… తెరపైకి కొత్త పేరు!!

-

టీడీపీ పగ్గాలు అచ్చెన్నకు ఇవ్వబోతున్నారనే విషయం ఆల్ మోస్ట్ కన్ ఫాం అయిపోయింది. ఈ మేరకు… రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని, ప్రధాన కార్యదర్శిగా బీద రవిచంద్ర యాదవ్ ను ఎంపిక చేశారు! హత్యానేరారోపణలతో అరెస్టయ్యి ప్రస్తుతం బెయిల్ పై ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును పార్టీ పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవాలని నిర్ణయించారు! అయితే ఈ పదవి తనకు ఇష్టం లేదని అంటున్నారంట అచ్చెన్న!

అవును… అచ్చెన్నకు టీడీపీ పగ్గాలు ఇవ్వడం అనే విషయం చినబాబు లోకేష్ తో పాటు కళావెంకట్రావు వంటి కొందరు సీనియర్లకు ఇష్టం లేదని కథనాలొస్తున్న తరుణంలో… బాబు కుటుంబంతో నేడున్న సంబంధాలకు బీటలు వాలటానికి ఈ పదవి కారణం అవుతుందేమోనని అచ్చెన్న ఆందోళన చెందుతున్నారని అంటున్నారు! చంద్రబాబు ఉన్నంత కాలం ఆ పదవిలో ఎవరు కూర్చున్నా పెద్దగా వారికి ఒరిగేదేమీ ఉండదు.. కాస్త అటు ఇటుగా రబ్బర్ స్టాంప్ అనే విమర్శ ఎలాగూ ఉంది!

కాబట్టి… లోకేష్ మనసు నొప్పించి, ఆ పదవి దక్కించుకోవడం వల్ల వ్యక్తిగతంగా లాభాల కంటే నష్టాలే ఎక్కువని అచ్చెన్న భావిస్తున్నారని అంటున్నారు! ఇందులో భాగంగానే… లోకేష్ కూడా పూర్తిగా నూటికి నూరుశాతం మనస్పూర్తిగా అంగీకరిస్తేనే తాను ఆ పదవిని స్వీకరిస్తాను తప్ప… మరో రకంగా, చినబాబు అన్యమనస్కంగా సరేనంటే మాత్రం తాను అంగీకరించనని తన సన్నిహితులవద్ద అచ్చెన్నా వాపోతున్నారని అంటున్నారు!

మరి ఈ విషయాలు చంద్రబాబు వరకూ చేరాయా.. లోకేష్ చెవిన పడ్డాయా అన్నది తెలియాల్సి ఉంది. తనకు ఏమేమి అర్హతలు ఉన్నాయో దాదాపుగా అవే అర్హతలు పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోబోతున్న కొల్లు రవీంద్రకు కూడా ఉన్నాయి కాబట్టి.. అందరికీ ఆమోదయోగ్యమైతే వారికే ఇవ్వమని కోరుతున్నారంట! మరి ఈ పదవి తెచ్చిన తంటా పార్టీలో ఎలాంటి అలజడులు సృష్టించబోతుందనేది వేచి చూడాలి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version