కేటీఆర్ అరెస్ట్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

-

కేటీఆర్ అరెస్ట్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్టు తన పార్టీ నాయకులే అంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పదే పదే అరెస్ట్ మాట కేటీఆర్ సింపతి కోసమే అన్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి మేమేమి కుట్ర చేయలేదని క్లారిటీ ఇచ్చారు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు బయటికి వస్తాయని తెలిపారు. లగచర్ల ఘటనలో కలెక్టర్, గ్రూపు-1 అధికారిని చంపే ప్రయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Sridhar Babu

మేము ఎవ్వరినీ తప్పు పట్టమని.. విచారణ జరుగుతుందన్నారు. రైతుల ముసుగులో కొందరూ వ్యక్తులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. బీజేపీ-బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రక్రియ జరుగుతుందన్నారు. ఏదో ఒక కేసులో తనను అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్ల ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండటంతో ఆ పార్టీ నేతలు చర్చించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version