Acharya​ :”ఆచార్య” నుంచి బిగ్ అప్డేట్.. శానా కష్టం సాంగ్ ప్రోమో రిలీజ్

-

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న తాజా సినిమా ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా… .. మరో జంటగా రామ్ చరణ్ అలాగే పూజా హెగ్డే నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే… పూర్తి కాగా విడుదలకు కూడా రెడీ అయింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్… మరియు పోస్టర్లు ఈ సినిమా పై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

షానా కష్టం అంటూ సాగే ఈ మాస్‌ సాంగ్‌ ప్రోమో ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ పాటలో టాలీవుడ్ హీరోయిన్ రెజినా, మెగాస్టార్ ఆర్ చిరంజీవి తో స్టెప్పులేసింది. అటు ఏజ్ మీద పడినప్పటికీ మెగాస్టార్ తన స్టెప్పులతో అదరగొట్టాడు. అలాగే ఈ పాటకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా కలిసి వచ్చింది. ఇక ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version