పలాసలో హై టెన్షన్.. అచ్చెన్న హౌస్ అరెస్ట్

-

శ్రీకాకుళం జిల్లా పలాస లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద ఈ రోజు టిడిపి నిరసన కు పిలుపునిచ్చింది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం తొలగిస్తామని మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఈ మేరకు నిరసనగా పిలుపునిచ్చింది. ఈ క్రమంలో టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని నిమ్మడలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు అచెన్నకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్లు సమాచారం.

తమని ఇలా నిర్బంధించడం పట్ల అచెన్ననిరసన వ్యక్తం చేశారు. పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ ఆయన నినాదాలు చేస్తున్నారు. అయితే ఆయన ఇంటి చుట్టూ భారీ ఎత్తున మోహరించిన పోలీసులు ఆయన ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. మరో పక్క పలాస టీడీపీ కార్యాలయంలో జిల్లా టిడిపి అధ్యక్షురాలు గౌతు శిరీషను హౌస్ అరెస్ట్ చేశారు. మరో పక్క కూన రవి కుమార్,  శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుని \ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు సమాచారం. టెన్షన్ వాతావరణం నెలకొనడంతో మున్సిపాలిటీ పరిధిలో 144వ సెక్షన్ విధించారు పోలీసులు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version