ప్రపంచాన్ని కరోనా ఇంకా టెన్షన్ పెడుతూనే ఉంది. లండన్లో రెండు కొత్త కరోనా వేరియంట్స్ ని కనుక్కోవడంతో ప్రపంచ దేశాలన్నీ టెన్షన్ లో మునిగిపోయాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఈ ఏడాది ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు క్లాసులు లేనట్లే అని చెబుతున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలను నేరుగా తరువాత తరగతికి ప్రమోట్ చేసే అవకాశాన్ని తెలంగాణ విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికలతో విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడాల్సి ఉంది. నిజానికి ఇప్పటికే పై తరగతుల వారిని స్కూల్స్ కి రమ్మంటున్నారు. చాలా వరకూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తరగతులు జరుగుతున్నాయి. అయితే చిన్న పిల్లల విషయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.