ఈ మధ్యకాలంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో తరచూ ఆడ పిల్లలపై జరుగుతున్న దాడులు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఒక దారుణ ఘటన గురించి మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఇటీవలే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న ముగ్గురు అక్కచెల్లెల్ల పై యాసిడ్ దాడి జరగటం అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. 8, 12, 17 సంవత్సరాల వయసు కలిగిన దళిత వర్గానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలపై గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో యాసిడ్ దాడి చేసి పరారయ్యారు.
యాసిడ్ దాడిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు స్వల్పంగా గాయపడ్డారు ఒక బాలిక పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక స్థానికులు వెంటనే స్పందించి ముగ్గురు బాలికలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలికలను కుటుంబ సభ్యులను విచారించి పలు వివరాలు సేకరించారు. సదరు ముగ్గురు బాలికల పై యాసిడ్ దాడికి ఎవరు పాల్పడ్డారు అనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు.