నేడు ఏసీబీ కస్టడీకి ఏసిపి నర్సింహారెడ్డి.. ఏమన్నా రాబడతారా ?

-

ఏసిపి నర్సింహారెడ్డిని నేడు ఏసీబీ కస్టడీకి తీసుకోనుంది. ఈ రోజు నుండి 4 రోజుల పాటు ఏసిపి నర్సింహారెడ్డిని ఏసీబి విచారించనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసిపి నర్సింహారెడ్డిని ఇప్పటికే ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాదాపూర్ హైటెక్ సిటీ వద్ద 50 కోట్ల విలువ చేసే రెండు వేల గజాల ప్రభుత్వ భూమి పై కన్నేసిన ఏసిపి నరసింహారెడ్డి, ఎనిమిది మంది కలిసి తప్పుడు పత్రాలతో భూమినీ స్వాధీనం చేసుకున్న వైనం వెలుగులోకి వచ్చింది.

ఇప్పటికే నర్సింహారెడ్డికి సాయం చేసిన సజ్జన్ గౌడ్, తిరుపతి రెడ్డి, ఎర్ర చంద్రశేఖర్, జైపాల్, బండి చంద్రారెడ్డి, మధుకర్ శ్రీరామ్, బత్తిని రమేష్, శ్రీనివాస్ రెడ్డి అలా మొత్తం ఎనిమిది మందిని కూడా ఏసీబీ అరెస్టు చేసింది. ఇప్పటికే నరసింహారెడ్డి ఇల్లు,బందువులు ఇళ్లు, బినామీ ఇళ్లలో కలిపి మొత్తం 25 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ, అనంతపూర్ లో 55 ఎకరాలు విలువ చేసే భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో ఏడున్నర కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించిన ఏసీబీ దానికి సమబందించి పూర్తి వివరాలు సేకరించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version