కాపు భవనాల నిర్మాణానికి రూ.5.41 కోట్లు !

-

కాపు భవనాల నిర్మాణానికి రూ.5.41 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటన చేశారు ఏపీ మంత్రి సవిత. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి సవిత. ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. జనవరి సీడాప్, బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో 10 వేల మందిని వ్యాపారవేత్తల తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

cm chandrababu 5.41 crores for the construction of Kapu buildings

ప్రీ, ప్రోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్పులకు రూ.254.48 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. నెలాఖరులోగా 104 బీసీ హాస్టళ్లలో ఎస్సార్ శంకరన్ రిసోర్సు సెంటర్ల ఏర్పాటు ఉంటుందన్నారు మంత్రి సవిత. కాపు భవనాల నిర్మాణానికి రూ.5.41 కోట్లు కేటాయిస్తున్నామన్నారు మంత్రి సవిత. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుకు నిర్ణయం అని వివరించారు మంత్రి సవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version