రవీందర్ సింగ్ కు బిగ్ షాక్.. కరీంనగర్ లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కైవసం

-

టిఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ కు బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు టి.భాను ప్రసాద్, ఎల్ రమణ గెలుపొందారు. 1200 ఓట్లు లెక్కింపు పూర్తి కాగా.. టిఆర్ఎస్ అభ్యర్థి భాను ప్రసాద్ కు 500 ఓట్లు రాగా.. ఎల్ రమణ కు 450 ఓట్లు పోల్ అయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి రవిందర్ సింగ్ కు కేవలం 175 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి.

ఇక ఇందులో 30 చెల్లని ఓట్లు పోల్ అయ్యాయి. ఇక అంతకు ముందు టిఆర్ఎస్ పార్టీ ని కచ్చితంగా.. ఒడిస్తానని.. రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ అన్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా..  నల్గొండ…తొలి ప్రాధాన్యత ఓట్లలో…. గెలువు కోటా సాధించారు టీఆరెస్ అభ్యర్థి కోటిరెడ్డి. ఖమ్మం .. MLC ఎన్నికల్లో 238 ఓట్స్ మెజారిటీ తో గెలిచారు టిఆర్ఎస్ అభ్యర్థి తాత మధు. ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా దండే విఠ‌ల్ ఘ‌న విజ‌యం సాధించారు. 740 ఓట్ల‌తో విజ‌యం సాధించారు దండే విఠ‌ల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version