చిత్ర పరిశ్రమలో విషాదం : కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి

-

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు.. చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. ఇప్పటికి మన దేశంలో ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. అయితే… తాజాగా ఈ కరోనా దాటికి.. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్‌ఎన్‌ ఆర్‌ మనోహర్‌ మృతి చెందారు.

ఆయన వయస్సు… 54 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా ఆయన చెన్నై లోని ఓ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు కొన్ని రోజుల కింద కరోనా పాజిటిగ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. గత 20 రోజులు గా కరోనా తో పోరాడుతూ… చివరికి ఇవాళ ఉదయం ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌ మృతి చెందారు. ఇక మనోహర్‌ మృతి చెందడంతో చిత్ర పరిశ్రమలో విషాదంలోకి వెళ్లింది. ఇక ఈ ఘటనపై ప్రముఖ నటులు సంతాపం తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version