బిజినెస్‌విమెన్‌గా మారిపోయిన కాజల్ అగర్వాల్

-

కాజల్‌కి ముందుచూపు మరీ ఎక్కువైపోతోంది. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తానని చెప్పినా, ఇండస్ట్రీని ఒక్కదాన్నే నమ్ముకుంటే లాభం లేదనుకుందో ఏమో, మరో ఫీల్డ్‌లోనూ అడుగుపెడుతోంది. సినిమాలు రాకపోయినా, కొత్త ప్రొఫెషన్‌తో కాలం గడిపెయ్యొచ్చని బిజినెస్‌ స్టార్ట్‌ చేసింది చందమామ.

కాజల్‌ సినిమాలతో పాటు మరో ఫీల్డ్‌లోనూ అడుగుపెట్టింది. బిజినెస్‌మెన్‌ గౌతమ్‌ కిచ్లూని పెళ్లి చేసుకున్నాక ఈమె కూడా బిజినెస్‌ విమెన్‌గా మారిపోయింది. ఓకీ అనే గేమింగ్‌ కంపెనీలో పెట్టుబడి పెట్టింది కాజల్. ఈ కంపెనీలో 15 శాతం వాటా కొనుగోలు చేసి, బోర్డ్‌ మెంబర్‌గా చోటు సంపాదించింది. పెళ్లి తర్వాత హీరోయిన్లకి అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే కాజల్ ఇప్పటినుంచే సైడ్‌ బిజినెసులు స్టార్ట్‌ చేస్తోందట. సినిమాలు పోయినా, ఈ గేమింగ్‌ కంపెనీతో సంపాదించుకోవచ్చని ఆశ పడుతోందట. అందుకే చందమామ బిజినెసులపై ఫోకస్‌ పెట్టిందని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version