Nagarjuna: చిరు,వెంకీ బాట‌లో కింగ్ నాగ్.. అసలేం చేయ‌బోతున్నడంటే..?

-

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున వరుస ప్రాజెక్టు లతో ఎంత బిజీగా ఉన్నాడో మనందరికీ తెలిసిందే. ఇటు బుల్లితెర, అటు వెండి తెర ప్రేక్ష‌కులకు ఎంత‌గానో అల‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం.. నాగార్జున బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రోవైపు.. సోగ్గాడే చిన్నినాయన సినిమా సీక్వెల్ గా బంగార్రాజు అనే మూవీని తెర‌కెక్కిస్తున్నారు. అయితే.. కింగ్ నాగ్ తన రూట్ మార్చుకున్నాడు.. కేవలం ప్రేమ… ఫ్యామిలీ… రొమాంటిక్ చిత్రాలే కాకుండా.. విభిన్నంగా సినిమాలు చేయాలనుకుంటున్నాడట.

మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్ లాగా… రీమేక్ చిత్రాలు చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే వెంకీ మామా.. నారప్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అలాగే.. మెగాస్టార్ చిరంజీవి.. చేస్తున్న గాడ్ ఫాదర్.. భోళా శంకర్ సినిమాలు సైతం రీమేక్ చిత్రాలే. మ‌రోవైపు ప‌వ‌ర్ స్టార్ కూడా ఇదే త‌ర‌హాలో రీమేక్ సినిమా చేస్తున్నాడు. మలయాళం సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను భీమ్లా నాయక్ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే..

ఇదే త‌ర‌హాలో కింగ్ నాగ్ కూడా రీమేక్ చేయాల‌నుకుంటున్నడట‌. ఈ క్ర‌మంలో మలయాళ సూపర్ హిట్ మూవీ మీద మనసు పడ్డట్టు తెలుస్తోంది. అంతగా ఆయ‌న మ‌న‌సు పారేసుకున్న చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచన్’. ఈ ఏడాది జనవరిలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి జియో బాబీ దర్శకత్వం వహించారు. నిమిషా సాజయన్, సూరజ్ వెంజరమూడు ప్రధానమైన పాత్రల్లో న‌టించారు.

చాలా తక్కువ బడ్జెట్ లో .. చాలా తక్కువ రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేసుకున్న మూవీ ఇది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా ను రీమేక్ చేయాలని ఉద్దేశం లో నాగార్జున ఉన్నట్లు వార్త లు వస్తున్నాయి. ఈ వార్త నిజ‌మైతే.. త్వరలోనే ఈ సినిమా ను మనం తెలుగులో నాగార్జున హీరోగా చూడొచ్చన్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version