సంక్రాంతి పండుగ నేపథ్యంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను దారుణంగా హత్య చేసి ఆ తర్వాత యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నార్సింగి పరిధిలోని పుప్పాలగూడలో మంగళవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
గుర్తుతెలియని మహిళను దారుణంగా హత్య చేసిన ఆ యువకుడు ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.అనంత పద్మనాభ స్వామి ఆలయం సమీపంలోని గుట్టల వద్ద ఇద్దరి డెడ్ బాడీలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు విచారణ ప్రారంభించారు. వీరి మరణాలకు కుటుంబసభ్యులే కారణమా? లేక ప్రేమ కారణమా? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.