సుధీర్‌తో రిలేషన్‌పై రష్మీ క్లారిటీ.. భవిష్యత్‌లో ఏదైనా జరగొచ్చు అంటూ..

-

ఎంతోకాలంగా స్టాండప్ కామెడీ షోగా అలరిస్తూ.. ఇప్పటికీ ఫేడవుట్ అవ్వకుండా నిలబడగలిగింది జబర్దస్త్. కానీ గతకొంతకాలంగా జబర్దస్త్‌పై నెగిటివిటీ పెరిగిపోయింది. పేరున్న కమెడియన్స్ అందరూ జబర్దస్త్ వదిలి వెళ్లిపోవమే దీనికి ముఖ్య కారణం. దీంతో ఈ షోలో కామెడీ తగ్గిపోయి, కాంట్రవర్సీ ఎక్కువయిపోయిందని నెటిజన్లు విమర్శించడం మొదలుపెట్టారు. ఇక జబర్దస్త్ ద్వారా చాలా పాపులారిటీ సంపాదించుకున్న రీల్ కపుల్ సుధీర్, రష్మి.

సుధీర్, రష్మీ.. వీరిద్దరి కెమిస్ట్రీకి బుల్లితెరపై చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే వీరు కూడా రియల్ కపుల్‌లాగా కలిసి మెలిసి ఉంటారు. వీరిద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందని ఎన్నోసార్లు ఓపెన్‌గా చెప్పుకొచ్చారు. కానీ అదంతా స్క్రీన్‌పైనే. వీరెప్పుడూ ఆఫ్ స్క్రీన్ కలిసి కనిపించడం కానీ.. చట్టాపట్టాలు వేసుకొని తిరగడం కానీ జగరలేదు. దీంతో వీరు కేవలం రీల్ కపులే అని కొందరికి క్లారిటీ వచ్చినా మరికొందరు మాత్రం వీరు రియల్ కపుల్ కూడా అని గట్టిగా నమ్ముతున్నారు.

తాజాగా ఈ విషయంపై సుడిగాలి సుధీర్‌తో తనకున్న అనుబంధంపై రష్మి మరోసారి స్పందించారు. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని అన్నారు. ‘నా గురించి అందరికీ వివరిస్తుంటే అసలు అది నా జీవితమే అవదు. అన్ని విషయాల్ని చెప్పాల్సిన అవసరం లేదు. అది నా వ్యక్తిగతం’ అని రష్మి అన్నారు. వ్యాఖ్యాత, నటుడు సుడిగాలి సుధీర్‌తో తనకున్న సంబంధం గురించి ప్రశ్న ఎదురవగా ఆమె స్పందించారు. రష్మి, నందు జంటగా నటించిన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా వారిద్దరు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

‘సుధీర్‌, రష్మికి మధ్య ఉంది స్నేహమా, ప్రేమా?, పెళ్లి ఆలోచన ఉందా?’ అని అడగ్గా.. ‘‘మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను. కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటా. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు. ఏం జరిగినా.. అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మేం ఆఫ్‌స్క్రీన్‌లో ఎలా ఉంటామో, అదే ఆన్‌స్క్రీన్‌పై కనిపిస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం. మేం అనుకొని అదంతా చేయలేదు.. ఓ మ్యాజిక్‌లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది’’ రష్మి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version