ఉదయనిధి స్టాలిన్ కు మద్దతుగా “బాహుబలి” కట్టప్ప

-

ఇటీవల తమిళనాడు మంత్రి మరియు సీఎం స్టాలిన్ కుమారుసు ఉదయనిధి స్టాలిన్ హిందూ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశాన్ని ఒక కుదుపు కుదిపాయి. ఉదయనిధి స్టాలిన్ పై చాలా మంది నేతలు, హిందూ సంఘాలు తమ ఆవేశాన్ని వెళ్లగక్కుతున్నాయి. కానీ ఉదయనిధి స్టాలిన్ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలపైనే కట్టుబడి ఉన్నాడు. అందులో అర్ధం మీకు సరిగ్గా అర్ధం కాలేదని వాదిస్తున్నాడు. ఇక తాజాగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు సత్య రాజ్ స్పందించాడు.. సత్యరాజ్ మాట్లాడుతూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపట్ల నాకేమీ తప్పుగా అనిపించలేదని చాలా మంది నోర్లు మూతపడేలా కామెంట్ చేశాడు. సనాతన దర్మం గురించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా ఉన్నాయన్నాడు సత్యరాజ్. నేను ఈ మధ్యన మంత్రి ఉదయనిధి వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడే మాటలు అన్నీ గమనిస్తున్నాను ..

ఈయన ధైర్యాన్ని తప్పక మెచ్చుకోవాల్సిందే అంటూ కొనియాడారు. ఇక ఈ బాహుబలి కట్టప్ప ఉదయనిధి కి సపోర్ట్ చేయడంతో ఈయనపై హిందూ సంఘాలు ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version