గూగుల్ మ్యాప్ ని నమ్ముకొని గోదారి లోకి వెళ్లిన లారీ..!

-

సాధారణంగా మనం ఎక్కడికి వెళ్లాలనుకున్న ప్రస్తుతం గూగుల్ మ్యాప్ ని ఆశ్రయిస్తుంటాం. కానీ ఆ గూగుల్ మ్యాప్ కనుక తప్పు చూపిస్తే.. ఇక అంతే సంగతులు ఇబ్బందులు తప్పవు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం కోల్పోయే అవకాశముంది. తాజాగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్  వద్ద ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. 

ఈ మధ్యకాలంలోనే గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తయి గుడాటిపల్లి గ్రామానికి వెళ్లాల్సిన దారులను మూసివేశారు. అయితే రామవరం నుంచి హుస్నాబాద్ కి వచ్చే పాతదారిని మూసివేయడంలో అధికారులు విఫలం చెందారు. దీంతో తాజాగా రోడ్డు నుంచి వస్తున్నటువంటి ఓ లారీ డ్రైవర్ నేరుగా హుస్నాబాద్ కు వెళ్లే రూటే అనుకొని డైరెక్ట్ గా డ్యామ్ లోకి వెళ్లిపోయాడు. అకస్మాత్తుగా అక్కడ నీళ్లు కనిపించడంతో ఏదైనా వాగు కావచ్చని అది దాటాక మళ్లీ రోడ్డు ఉంటుందనుకున్నాడు. అలా ఎంత దూరం వెళ్లినా నీళ్లు ఎక్కువ కావడంతో లారీ ఆగిపోయింది. లారీ డ్రైవర్ ఆ నీటిలో చిక్కుకున్నాడు. ఇది గమనించిటువంటి రామవరం గ్రామస్తులు ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్ కి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎంపీటీసీ జేసీబీ సహాయంతో లారీని, డ్రైవర్ బయటికీ రప్పించి ప్రాణపాయం నుంచి కాపాడారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version