కరాటే కళ్యాణి, నరేష్ లపై నటి హేమ ఫిర్యాదు !

-

మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు చాలా హాట్ హాట్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ… ప్యానల్ సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. వరుసగా ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నటి హేమ లేఖ రాసింది. కరాటే కళ్యాణి మరియు నటుడు నరేష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేసింది ఈ నటి హేమ.

తనకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన వీడియోలు మార్పింగ్ చేసి యూట్యూబ్ లో కరాటే కళ్యాణి మరియు నరేష్ పెడుతున్నారని ఆరోపణలు చేసింది నటి హేమ. దీనిపై ఇప్పటికే క్రైం పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని… అయినప్పటికీ వారు తమ బుద్ధిని మార్చుకోవడం లేదని మండిపడింది.

తోటి నటి పట్ల… ఇంతటి అరాచకానికి పాల్పడుతున్న వారిద్దరిపై మా ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వారిద్దరి ఓటు హక్కును తొలగించాలని డిమాండ్ చేసింది హేమ. తన లేక పట్ల ఎన్నికల అధికారి కృష్ణ మురళి తొందరగా స్పందిస్తారని ఆశిస్తున్నాం అట్లు లేఖలో పేర్కొంది నటి హేమ. కాగా మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version