34 యేళ్ళ తర్వాత మళ్ళీ మహేష్ తో మెరిసిన మోడ్రన్ అత్త..!!

-

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో చివరిసారిగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా కరోనా కారణంగా పలు సార్లు షూటింగ్ వాయిదా వచ్చిపడితూ ఏకంగా రెండు సంవత్సరాలు వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఈ రోజు అనగా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా అలరించింది అని చెప్పవచ్చు.

మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మహేష్ బాబు జి ఎం బి ఎంటర్టైన్మెంట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు 14 రీల్స్ ప్లస్ వారు కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా మోడ్రన్ అత్త గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నదియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ఎంతో మంది స్టార్ హీరోలకు అమ్మగా, అత్త గా నటిస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా సర్కారు వారి పాట సినిమాలో సుమారు 34 సంవత్సరాల తర్వాత మరొక సారి మహేష్ బాబుతో కలిసి నటించడం గమనార్హం.

మొదటిసారి మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు , ఆయన అన్నయ్య రమేష్ బాబు నటించిన బజారు రౌడీ సినిమా లో నదియా హీరోయిన్ గా నటించింది. బజారు రౌడీ సినిమాలో నదియా డ్యుయల్ రోల్ పాత్ర పోషించింది. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1988 లో వచ్చే సూపర్హిట్ విజయాన్ని అందుకుంది . 34 సంవత్సరాల తర్వాత మహేష్ కలిసి నటించడం చాలా ఆనందదాయకమని చెప్పవచ్చు. విశేషం ఏమిటంటే బజారు రౌడీ సర్కారీ వారి పాట.. రెండు సినిమాలలో కూడా మహేష్ పేరు మహేష్ కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version