రకుల్ ప్రీత్ సింగ్ దానికి బానిస.. అలా చేయకుండా ఉండలేదట!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్​ రకుల్​ప్రీత్​ సింగ్​ ప్రస్తుతం తెలుగులో కాస్త జోరు తగ్గించి బాలీవుడ్​పై ఫుల్​ ఫోకస్​ పెట్టింది. అక్కడ స్టార్​ హీరోల సరసన వరసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అలా ఈ ఏడాది ఇప్పటివరకు ఐదు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. మరిన్ని చిత్రాల్లో నటిస్తూ ఫుల్​ జోష్​లో ఉంది. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను వర్క్​ ఆల్కాహాలిక్​ అని చెప్పింది. తానెప్పుడు తర్వాత ఏం చేయాలనే విషయంపై ఆలోచిస్తూ ఉంటానని పేర్కొంది.

“మనం పోషించడానికి ఇక్కడ ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఈ వృత్తిలో ఒక బెంచ్​మార్క్​ను నిర్దేశించలేం. ఇక్కడ హద్దులు లేవు. నేను మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటున్నాను. నేను పని పట్ల ఎంతో ఆకలితో ఉన్నాను. నేను వర్క్​ ఆల్కాహాలిక్​. నావి ఈ ఏడాది ఇప్పటికే ఐదు సినిమాలు రిలీజ్​ అయ్యాయి.

కానీ నేను తర్వాత ఏం చేయాలి అనే విషయం గురించే ఆలోచిస్తున్నాను. నేనెప్పుడు ‘తర్వాత ఏంటి’ అనే ఆలోచనలోనే ఉంటాను. రన్​వే 34, ఛత్రివాలి, థ్యాంక్ గాడ్​ లాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాను.

ఈ వృత్తి ఎంతో అందమైనది. రకరకాల సినిమాలు చేయొచ్చు. నేను విలక్షణమైన నటిని. అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నేను రివ్యూలు చదువుతుంటాను. ఒకవేళ అది మంచి ఫీడ్​బ్యాక్ గొప్పగా అనిపిస్తుంది.​ క్రిటికల్​గా ఉంటే మనల్ని మనం మరింత మెరుగుపరచుకోవాడనికి ఉపయోగపడుతుంది.” అని చెప్పింది.

ఇక తాజాగా విడుదలైన థ్యాంక్​ గాడ్​ సినిమా గురించి మాట్లాడుతూ.. “నేను ఆధ్యాత్మిక వ్యక్తిని. కర్మను ఎక్కువగా నమ్ముతాను. ఓ మంచి వ్యక్తిలా ఉండాలనుకుంటున్నాను. దర్శకుడు ఇంద్రకుమార్​తో పనిచేసిన తర్వాత నాలో అధ్యాత్మికత మరింత పెరిగింది. మేము దేశంలో ఉన్న దేవుడు, మతం, ఆచారాలు వంటి అంశాలపై మాట్లాడుకున్నాము.

దేవుడికి మానవత్వం కావాలి. అది మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సరిగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది. థ్యాంక్ గాడ్ సినిమా ఈ విషయాన్నే తెలియజేస్తుంది” అని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది రకుల్​.. అటాక్​, రన్​వే 34, కట్​పుత్లీ, డాక్టర్​ జీ, థ్యాంక్ గాడ్​ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఛత్రివాలీ, మేరీ పత్నీ కా రీమేక్​, ఇండియన్​ 2, అయాలాన్​, 31 అక్టోబర్​ లేడీస్ నైట్​ చిత్రాల్లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version