అసలు కెన్యా ప్రభుత్వంతో ఒప్పందమే కుదుర్చుకోలేదని బాంబ్ పేల్చింది అదాని గ్రూప్స్. కెన్యా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంపై అదాని గ్రూప్స్ కీలక ప్రకటన చేసింది. అసలు అలాంటి ఒప్పందమే కుదుర్చుకోలేదని వెల్లడించింది అదాని గ్రూప్స్. ఇటీవల అదానితో కుదుర్చుకున్న 2.5 బిలియన్ డాలర్ల ఒప్పందాల్ని రద్దు చేసుకుంది కెన్యా ప్రభుత్వం.
ప్రధాన విమానాశ్రయ నిర్వహణకు సంబంధించి కెన్యాతో ఒప్పందం కుదుర్చుకోలేదని తాజాగా అదాని గ్రూప్స్ ప్రకటన చేసింది. విద్యుత్తు ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణం, వాటి నిర్వహణకు ఒప్పందంపై సంతకం చేశామంటూ స్పష్టం చేసింది.
ఇక అటు అదాని చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అదానీతోపాటు మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికా నోటీసులు జారీ అయ్యాయి. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలన్న స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్… ఈ మేరకు అదానీతోపాటు మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికా నోటీసులు జారీ అయ్యాయి. సౌర విద్యుత్తు కాంట్రాక్టులు కోసం లంచాలిచ్చారన్న ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.