ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఈ నాటకం : అద్దంకి దయాకర్

-

బీజేపీ బిల్లా, రంగాలు కొత్త డ్రామాకు తెరలేపిండ్రు. రాజకీయ లబ్ది కోసం కొత్త నాటకం ఆడుతున్నారు అని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. రాహుల్ గాంధీ కులం, మతం అంటూ రాజకీయం చేస్తున్నారు. పరమానందయ్య శిస్యుల లాగ ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఈ నాటకం. అయితే మీ వల్ల రాష్ట్రానికి రూపాయి ఉపయోగం లేదు అని ఆయన పేర్కొన్నారు.

ఇక కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు పనికిరాని మంత్రులు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మిమ్ముల్ని ఎవ్వరూ నమ్మరు. రాహుల్ గాంధీ కులం ఏంటని అడగడం మీ రాజకీయ దివాలకోరుకు నిదర్శనం. కేసీఆర్ ను మైమరిపించేలా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం నెహ్రు కుటుంబం. అలాంటి కుటుంబాన్ని కించపరిస్తే మిమ్ముల్ని ఎవరు క్షమించరు. కాంగ్రెస్ పునాదుల మీద దేశం ఏర్పడ్డది. అయితే ఈ కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నిస్తోంది అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news