సిద్ధం సభలో ఎంపీ పై ఆదిరెడ్డి ఫైర్..!

-

సిద్ధం సభలో ఎంపీ భరత్ చెప్పు చూపించి ఆదిరెడ్డి అప్పారావు ని చెప్పుతో కొట్టాలని చేసిన కామెంట్స్ పై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి రాజమండ్రి సిటీ జనసేన ఇన్చార్జి సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఎన్నికల దగ్గర పడుతున్న టెన్షన్లో పడి ఎంపీ భరత్ ఏమీ మాట్లాడుతున్నారో తెలియట్లేదు అన్నారు.

నీకు సంస్కారం ఉందా అని భరత్ ని అడిగారు. రాజమండ్రి సిటీలో ఎంపీగా గత ఎన్నికల్లో నీకు 28000 ఓట్లు టిడిపి అభ్యర్థి కంటే తక్కువ వచ్చాయని నీకు గుర్తుందా అని అన్నారు ఆదిరెడ్డి అప్పారావుని ప్రశ్నించారు. అంతా వద్దంటే వేసిన సెంట్రల్ లైటింగ్ ని ఇప్పుడు తీసేస్తాను అంటున్నావు మరి ఆ ఖర్చు దుర్వినియోగం కదా నీది ఫెయిల్యూర్ సినిమా అని నువ్వు ఒక్క సినిమాలో నటిస్తే రెండో రోజే ఆగిపోయిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news