నిన్న విడుదలైన ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ట్రైలర్ యు ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రేక్షకులు అనుకున్నట్లే అద్భుతంగా ట్రైలర్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్ సక్సెస్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ప్రభాస్ మొదటిసారి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో కలిసి చేస్తున్న చిత్రం కావడంతో చాలా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా మరియు కృతి సనన్ జతగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ విడుదలయ్యి 24 గంటలు గడవగా, యు ట్యూబ్ లో ఆత్యదిక వ్యూస్ తో దూసుకుపోతోంది.
షాకింగ్ వ్యూస్: యు ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోన్న “ఆదిపురుష్” !
-