తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలును టచ్ చేసే దమ్ము ఉందా కేటీఆర్ అంటూ ప్రభుత్వ విప్ ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు. సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని పార్లమెంట్ కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి తో కలిసి సిరిసిల్లలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు అధికారాన్ని కోల్పోయామని జీర్ణించుకోలేక మాట్లాడే అహంకారపూరితమైన మాటలను మానుకోవాలని అన్నారు.
ఉద్యమ సమయంలో పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చారని లక్షల కోట్ల రూపాయలనే దండుకున్నారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ని బీఆర్ఎస్ పార్టీగా మార్చారని ఆరోజే తెలంగాణతో పేగు బంధం తెగిపోయింది అని అన్నారు. రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రిని టచ్ చేస్తే 1000 వోల్టేజ్ల కరెంట్ షాక్ తగిలి మాడిపోతావ్ అని కేటీఆర్ ని హెచ్చరించారు. దొర అహంకారంతో మాట్లాడితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని అన్నారు