వైఎస్ వివేకా హత్య కేసులో చట్టం తన పని చేసుకుపోతోంది – మంత్రి ఆదిమూలపు సురేష్

-

వైఎస్ వివేకా హత్య కేసులో చట్టం తన పని చేసుకుపోతోందని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్. చట్టానికి ఎవరూ అతీతులు కాదు..సీఎం జగనే కేసును సీబీఐకి ఇవ్వమని చెప్పారని వివరించారు. ఎవరైతే దోషులు ఉన్నారో వారు బయటకు రావాల్సిందేనని.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాకు ఎన్నిసార్లు వచ్చాడు.. ఏం చేశాడో చెప్పి జిల్లా పర్యటనకు రావాలనికోరారు.

వెలిగొండ ప్రాజెక్టుపై ఐదేళ్లు కాలయాపన చేశాడు..అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టుపై చిత్తశుద్ది లేకుండా ఇప్పుడు గాలిమాటలు చెప్పటానికి వస్తున్నాడని తెలిపారు. ఇప్పుడు మళ్లీ కాకమ్మ కబుర్లు చెప్పటానికి పర్యటనకు వస్తున్నాడు..ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండా ఐదేళ్లు వెలిగబెట్టి తగుదునమ్మా అని రావటానికి సిగ్గులేదా..అని నిలదీశారు. వైఎస్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టుకు శంఖుస్ధాపన చేశారు..ప్రాజెక్టును పైర్తి చేసి సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారని ప్రకటించారు మంత్రి ఆదిమూలపు సురేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version