బైజూస్ ను జగన్ జూస్ అని చంద్రబాబు వెటకారంగా మాట్లాడుతున్నాడు: ఆదిమూలపు

-

టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. బలహీన వర్గాల పిల్లలకు న్యాయమైన విద్యను అందిస్తూ ఉంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. బైజూస్ ను జగన్ జ్యూస్ అని చంద్రబాబు వెటకారంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యాయమైన సాంకేతిక విద్యను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా బైజూస్ కు పేరు ఉంది అన్నారు.

రాష్ట్రంలో 27 వేల కిలోమీటర్లకు పైగా పంచాయితీలో రోడ్లు శాచ్యురేషన్ పద్ధతిలో అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. జూలై 20 లోపు మరమ్మతులు, నిర్మాణం పూర్తి చేసి నాడు- నేడు కింద ప్రదర్శించాలని సీఎం ఆదేశించారని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో హ్యాబిట్ విలేజీ లకు 5 వేల కిలోమీటర్లు రోడ్లు పూర్తి చేశామన్నారు. గిరిజన ప్రాంతాల్లో మిగిలిన మూడు వేల కిలోమీటర్ల కనెక్టెడ్ హ్యాబిట్ విలేజిల రోడ్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు అన్నారు. రోడ్ల నిర్మాణాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు ఆదిమూలపు.

Read more RELATED
Recommended to you

Exit mobile version