విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తనని కలవడానికి వచ్చేవారు బొకేలు, శాలువాలు కాకుండా స్టేషనరీ, నోట్ బుక్స్ తీసుకురావాలని పిలుపునిచ్చారు. తననే కాకుండా ఇతర నేతలను కలపడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా ముందుకు సాగాలని ఆమె ప్రజలను కోరారు. వృధా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు సబితా.
స్థానికంగా ఉండే విద్యార్థులకు నోటు పుస్తకాలు, వాటర్ బాటిల్స్, బ్యాగులు, పెన్నుల వంటివి.. అలాగే టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాలలో స్కూల్లను దత్తత తీసుకోవాలని సూచించారు. నూతన సంవత్సరంలో అందరూ సమాజానికి ఉపయోగపడే ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకొని అమలు చేస్తే బాగుంటుందన్నారు.