TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజ్‌.. అసిస్టెంట్ ఇంజినీర్స్‌ పరీక్ష రద్దు

-

రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో కొత్త విషయం బయటకొస్తుంది. ఈ కేసును తవ్వుతున్న కొద్దీ పేపర్ల లీకేజీ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనపై టీఎస్పీఎస్సీ స్పందిస్తూ.. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షను రద్దు చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 5న జరిగిన ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు  ప్రకటించింది. మళ్లీ ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామో అనేది తొందరలోనే వెల్లడిస్తామని కమిషన్‌ పేర్కొంది.

వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 837పోస్టులకు 74, 478 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 55వేల మంది పరీక్ష రాశారు. అయితే ప్రశ్నపత్రం లీకయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో.. పరీక్షను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ లీకేజీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాలని డీజీపీని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version