Asia Cup 2022: బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్‌ ఘన విజయం

-

Asia Cip 2022 : ఆసియా కప్‌ లో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు మరో విజయాన్ని తన ఖాతాల్లో వేసుకుంది. తొలి మ్యాచ్‌ లోనే శ్రీలంక జట్టును చిత్తు చేసిన ఆఫ్ఘానిస్తాన్‌.. మంగళవారం బంగ్లాదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌ లోనూ ఆల్‌ రౌండ్‌ ప్రదర్శన కనబరిచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో కేవలం 127 పరుగులు చేయడంతో ఆఫ్ఘాన్‌ బ్యాటర్లు మొదటి నుంచి ఆచితూచి ఆడుతూ.. పరుగులు రాబట్టారు. ఈ నేపథ్యంలోనే 9 బంతులు మిగిలి ఉండగానే.. 128 రన్స్‌ టార్గెట్‌ ను 7 వికెట్ల తేడాతో ఆప్థాన్‌ గెలుపొందింది.

ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్నర్లు బంగ్లాదేశ్‌ ను నామమాత్రపు స్కోర్‌ కే కట్టడి చేశారు. ముజీద్‌, రషీద్‌ ఖాన్‌ లు తలో మూడు వికెట్లు పడగొట్టి.. బంగ్లా నడ్డి విరిచారు. వీరిద్దరి ధాటికి బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులకే పరిమితమైంది. మొసద్దెక్‌ హుసేన్‌ రాణించడంతో బంగ్లా జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇక అటు ఆసియా కప్‌ లో రెండో విజయాన్ని నమోదు చేసింది ఆఫ్ఘానిస్తాన్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version