తెలంగాణకు షాక్‌..విద్యుత్ బకాయిలపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం !

-

తెలంగాణ ప్రభుత్వానికి బిగ్‌ షాక్‌. విద్యుత్ బకాయిలపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఏపీకివ్వాల్సిన విద్యుత్ బకాయిలపై ఒత్తిడి పెంచే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కేంద్ర ఉత్తర్వుల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వానికి బకాయిల చెల్లింపులపై లేఖ రాసే యోచనలో ఏపీ సర్కార్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం వేసే కొర్రీలకు స్ట్రాంగ్ కౌంటర్లు సిద్దం చేస్తున్నారు ఏపీ విద్యుత్ శాఖ అధికారులు. తెలంగాణ ప్రభుత్వం చెప్పే ఏపీ బకాయిలు డిస్కంల విభజన వ్యవహరమంటోన్న ఏపీ అధికారులు… విద్యుత్ సరఫరాకు.. డిస్కంల విభజనకు ముడి పెట్టడం సరి కాదంటోన్నారు. డిస్కంల విభజన పంచాయతీని తేల్చాల్సింది కేంద్రమేనంటోన్నారు ఏపీ అధికారులు. కాగా… తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్‌ కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యుత్ బకాయిల చెల్లింపు పై తాజాగా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి బకాయిలు ఉన్న నిధులు వెంటనే చెల్లించాలని తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version