బ్యాడ్‌ న్యూస్: సమ్మర్ సీజన్ అయిపోతే…?

-

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తోన్న అలజడికి మానవ జాతి అల్లల్లాడిపోతుంది! ఎప్పుడు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టగలుగుతారా అని ప్రపంచం మొత్తం ఒకే ఆశతో ఎదురుచూస్తుంది. అయితే… ఇప్పుడున్న పరిస్థితికే ఇలా అయిపోతే… ఇది వేసవి కాలం కాకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది అని చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలోని ముఖ్య అధికారి! అవును… వేసవి కాలం కాబట్టే ఈ వైరస్ తీవ్రత ఇంకా అదుపులో ఉందని… వర్షాకాలం స్టార్ట్ అయితే పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నట్లుగా అభిప్రాయాన్ని వ్యక్తిపరిచారు.

అవును… కరోనా వైరస్ వ్యాప్తిని వేసవికాలం లాంటి పరిస్థితులు అడ్డుకుంటాయని అమెరికాలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీస్ శాస్త్ర, సాంకేతిక విభాగ డైరెక్టరేట్ అధికారి బిల్ బ్రియాన్ చెబుతున్నారు. తమ పరిశోధనల్లో.. కరోనా వైరస్ వ్యాప్తికి వేసవి పరిస్థితులు ఖచ్చితంగా ప్రతిబంధకాలుగా నిలుస్తాయని తేలినట్లు ఆయన చెప్పారు. ఈ విషయంలో పర్టిక్యులర్ గా ప్రస్తుత భారత దేశ వాతావరణ పరిస్థితులు సరిగ్గా సరిపోతాయని.. కరోనాను ఎదుర్కొనేందుకు ఇదో మంచి అవకాశమని ఆయన చెబుతున్నారు!

నేరుగా సూర్య కిరణాలు, వేడిగాలులు వైరస్ కు తగిలితే అది దాని శక్తి కోల్పోతుందని, తద్వారా అది చనిపోయే అవకాశం ఉందని బ్రియాన్ చెబుతున్నారు. 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడిగాలులు వీస్తే 18 గంటల ఆయుస్సు కలిగిన వైరస్ నిమిషాల వ్యవధిలో చనిపోతుందని ఆయన తెలిపారు. దీంతో… ప్రస్తుతం భారత్ లో ఉన్న వేసవి వాతావరణ పరిస్థితులను చక్కగా వినియోగించుకుని.. ప్రతీ పౌరుడూ ప్రభుత్వ సూచనలు పాఠిస్తూ ఉంటే… వర్షాలు పడేలోపు ఉన్నంతలో కాస్త ఉపశమనం పొందొచ్చని… వర్షాకాలం స్టార్ట్ అయితే మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితులకంటే తీవ్రమైన పరిస్థితులు నెలకొంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే… ప్రకృతీ సృష్టించిన వైరస్ కు పరిష్కారం కూడా ప్రకృతిలోనే ఉందన్నమాట… కాకపోతే మనమే అర్ధం చేసుకుని మెలగాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version