రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు జగన్ పై రాయితో దాడి చేయడంతో ఆయన ఎడమ కన్నుకు గాయమైన సంగతి తెలిసిందే.కాగా.. దీనిపై పెద్ద రచ్చే జరుగుతోందిఅయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాయి దాడి ఘటనపై ఆసక్తికర వ్యాఖ్యలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారు.శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీ తర్వాత సీఎంగా మరోసారి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు ఎన్ని రాళ్ల దాడులు చేసినా, ఎన్ని హత్యాయత్నాలు చేసినా.. మొక్కవోనిదీక్షతో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నారని అన్నారు .అంతేకాదు రాళ్ల దాడి అనంతరం ప్రజల్లో తెలుగుదేశం-టీడీపీ-జనసేన కూటమిపై కసి పెరిగిందన్నారు.. దాడి తర్వాత బస్సు యాత్రకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివస్తున్నారని అన్నారు .మరోసారీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయాన్ని దుష్ట చతుష్టయం అడ్డుకోలేదని అన్నారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, పురంధేశ్వరి నీచ రాజకీయాలు చేస్తున్నారు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.