ప్రశాంత్ వర్మ -రణ్ వీర్ సింగ్ కాంబోలో క్రేజీ మూవీ?

-

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.

ఈ సినిమా సూపర్ హిట్ కావడం వల్ల ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ క్రేజ్ సంపాదించారు. దీంతో ఆయన తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్తో తన తదుపరి మూవీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఓ మైథలాజికల్ సబ్జెక్టుతో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. కొత్త సినిమాకు సంబంధించి ప్రశాంత్-రణ్వీర్ మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version