గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ నివారణ కు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కరోనా వైరస్ మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. గత కొన్ని రోజుల నుంచి అయితే రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో ఏపీ ప్రజలందరిలో ప్రాణభయం పాతుకుపోయింది. అయితే తాజాగా గత 24 గంటల కు సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 7,813 కొత్త కేసులు నమోదైనట్లు ప్రభుత్వం నివేదికలో వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 88,651 కి చేరుకుంది. అంతే కాదు ఇవాళ ఒకే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 52 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఏపీలో మృతుల సంఖ్య 985 చేరింది.