ఎట్టకేలకి ఓటీటీ లోకి వస్తున్న అఖిల్ సినిమా..!

-

అఖిల్ హీరోగా హిట్ లు కొట్టాలని ఎంతగానో ట్రై చేస్తున్నారు కానీ ప్రతిసారి అఖిల్ కి హిట్ లభించట్లేదు. డిజాస్టర్లే ఉంటున్నాయి. అఖిల్ అక్కినేని హీరోగా ఏజెంట్ సినిమా వచ్చింది దర్శకుడు సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ కథతో 80 కోట్ల బడ్జెట్ తో సినిమాని తీశారు ఎన్నో అంచనాలతో ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ అయింది. కానీ మూవీ డిజాస్టర్ గానే మిగిలిపోయింది అఖిల్ కెరియర్లో కోల్కోలేని దెబ్బ తగిలింది.

ఈ సినిమా కారణంగా నిర్మాతలకి కూడా భారీ నష్టాలు ఎదురయ్యాయి కథలో కొత్తతనం లేకపోవడం వలన ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సినిమా ఓటీటీ డేట్ పై ఏడాది నుండి సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా ఓటిటిలో అసలు రిలీజ్ అవుతుంది అనేది కూడా తెలియలేదు. ఎట్టకేలకి ఓటిటిలోకి ఈ సినిమా వచ్చింది. జనవరి 26 నుండి సోనీ లీవ్ ఓటీటీలో ఈ ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు తో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో కూడా ఈ సినిమా వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version