విజయవాడ హైవేపై అఘోరి హల్చల్.. పవన్‌ వచ్చి కలిస్తేనే!

-

ప్రస్తుతం ఏపీలో సంచరిస్తున్న మహిళా అఘోరి అక్కడ నానా రభసా చేస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోంది. విజయవాడలోని మంగళగిరి వద్ద గల జనసేన పార్టీ కార్యాలయం దగ్గర రహదారిపై పైన బైటాయించిన అఘోరి.. తను పవన్ కళ్యాణ్‌ని కలవాలి అంటూ నినాదాలు చేసింది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిసిన తర్వాత వెళ్తానంటూ రహదారిపై పైన బైటాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది. చేతిలో త్రిశూలం పట్టుకుని వచ్చి పోయే వారిని బూతులు తిడుతూ బెదిరింపులకు గురిచేసింది. పోలీసులు పక్కనే ఉన్నా వారి మాటలను బేఖాతర్ చేస్తూ ఆమెకు నచ్చినట్లు రభస చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version