మొఘలులు మనకి ఆదర్శం కాదు.. ఆగ్రాలో మ్యూజియం పేరు మార్పు..

-

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ఆగ్రాలో నిర్మిస్తున్న మ్యూజియం పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ గా మార్చేందుకు ఉత్తర్వులు జారీ చేసారు. ఈ విషయమై అందరితో సమావేశమయిన యోగీ ఆదిత్యనాథ్, పేరు మార్చేందుకు డిసైడ్ అయ్యారు. దేశంలో నిర్మిస్తున్న ఏ నిర్మాణానికైనా ఆ దేశం గర్వించే పేర్లనే పెట్టాలని, దేశంలోని ప్రజలని పీడించిన పాలకుల పేర్లు అవసరం లేదని అన్నారు. మొఘలులు మనకి ఆదర్శం కాదు. మన దేశం గర్వించే వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అందుకే ఆయన పేరును మ్యూజియానికి పెడుతున్నామని ప్రకటించారు.

ఈ మ్యూజియాన్ని తాజ్ మహాల్ కి తూర్పు భాగాన నిర్మిస్తున్నారు. ఇందులో ఛత్రపతి శివాజీకి సంబంధించిన వివరాలతో పాటు మొఘలుల తాలూకు చరిత్ర కూడా ఉంటుందట. ఈ నిర్మాణానికి సుమారుగా 14ఒకోట్లు ఖర్చు అవుతున్నాయట. భారతదేశంలో మొఘలుల పాలన ఎలా సాగిందన్న చరిత్రతో పాటు, శివాజీ పాలనకి సంబంధించిన వివరాలు ఉంటాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version