వ‌రి ధాన్యం కొనుగోలుపై మెడ మీద క‌త్తి పెట్టి అగ్రిమెంట్ చేశారు : కేశ‌వ‌రావు

-

త‌మ మెడ‌పై కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు క‌త్తి పెట్టి వ‌రి ధాన్యం విషయంలో అగ్రిమెంట్ రాసుకున్నార‌ని టీఆర్ఎస్ రాజ్య స‌భ ఎంపీ కే. కేశ‌వ‌రావు అన్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై అగ్రిమెంట్ ఇవ్వాల‌ని ఒత్తిడి తీసుకువ‌చ్చార‌ని అన్నారు. అందుకే తెలంగాణ రైతుల‌ను ప్ర‌త్యామ్నాయ పంట‌లు వేయాల‌ని రైతుల‌ను కోరామ‌ని అన్నారు. కాగ తెలంగాణ లో రైతులు పండించే ప్ర‌తి గింజ‌ను కేంద్ర ప్ర‌భుత్వమే కొనుగోలు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

k keshava rao comments about tsrtc strike

కేంద్ర ప్ర‌భుత్వం వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని ఇప్ప‌టికే టీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు చేస్తున్నామ‌ని అన్నారు. భ‌విష్య‌త్తులో త‌మ ఆందోళ‌న‌ల‌ను మ‌రింత ఉధృతం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నామ‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం పాసిస్ట్ ప‌ద్ద‌తిలో వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని మండిప‌డ్డారు. వ‌రి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రానికి చెప్పాల్సిన విధంగా పార్లమెంట్ లో చెప్పామ‌ని అన్నారు. కేంద్రం రైతులకు సహకరించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news