పత్తిలో ‘‘అధిక సాంద్ర పద్ధతి’’ రైతులకు మేలు.. ఎకరాకు 13-15 క్వింటాళ్ల దిగుబడి

-

తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది పత్తి రైతులు చాలా లాభం పొందారు. గతేడాదితో పోలిస్తే మద్దతు ధర కన్నా ఎక్కువగా ధర పలకడంతో రైతుల హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా పత్తి బహిరంగ మార్కెట్ లో డిమాండ్ కారణంగా ఈ ఏడాది క్వింటాల్ కు రూ. 10,000 వరకు కూడా రేటు పలికింది. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులకు లాభాాలు వచ్చాయి.

తెలంగాణలో పండించే పంటల్లో ఎక్కువ శాతం వరిని వాణిజ్య పంటగా పత్తిని పండిస్తున్నారు. దాదాపు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతోంది. ఇదిలా ఉంటు పత్తి దిగుబడి ఏటేటా తగ్గిపోవడంతో పాటు.. కూలీల ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి. ఈ ఏడాది ఎక్కువ ధర ఉండటంతో తక్కువ దిగుబడి వచ్చినా.. రైతులు కనీస లాభాలతో బయటపడ్డారు. దీంతో కొత్త విధానంతో లాభాలు పొందేందుకు వ్యవసాయ అధికారులు ‘‘అధిక సాంద్ర పద్దతి’’ లో పత్తిసాగును ప్రోత్సహిస్తున్నారు.

అసలేంటి ఈ ‘‘అధిక సాంద్ర పద్దతి’’:

అధిక సాంద్ర పద్దతి అనేది ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాల్లో అమలులో ఉంది. ఈ విధానం ద్వారా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట దిగుబడిని సాధించే అవకాశం ఉంది. మన దేశంలో పత్తి పంట సాగు విధానంలో ఒక ఎకరా విస్తీర్ణంలో కేవలం 3 నుంచి 4 వేల పత్తి విత్తనాలను మాత్రమే విత్తుతున్నాము. దీంతో చాలా వరకు భూమి ఖాలీగానే ఉంటుంది. ఇదే అధిక సాంద్ర పద్దతిలో అయితే 25 వేల నుంచి 30 వేల వరకు విత్తనాలను విత్తుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఒకే సారి పత్తి పంట చేతికి వస్తుంది. ఈ విధానం వల్ల ఎకరాకు దాదాపుగా 13-15 క్వింటాళ్ల పత్తి దిగుబడి సాధించవచ్చు.

రెండో పంటకు ఛాన్స్:

మన దేశంలో పత్తిని పలు విడతల్లో రెండు మూడు సార్లు ఏరుతున్నారు. అధిక సాంద్ర పద్దతి వల్ల ఒకేసారి పంటను ఏరడంతో పంట ఖర్చులను తగ్గించుకోవచ్చు. మళ్లీ రెండో పంటకు ఛాన్స్ ఉంటుంది. అధిక సాంద్ర పద్దతి వల్ల జూన్, జూలై మాసాల్లో పత్తిని విత్తుకుంటే… నవంబర్, డిసెంబర్ కల్లా పంట చేతికి వస్తుంది. దీని తర్వాత శనెగలు, నూలు వంటి పంటలను పండించుకోవచ్చు. దీంతో ఒకే భూమిలో రెండు రకాలుగా ఆదాయం పొందవచ్చు.

ఎన్నో లాభాలు:

పత్తి పంటను పండించేందుకు అనేక  ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మన దేశంలో పత్తి పంటను జూన్, జూలై లో విత్తుకుంటే.. జనవరి, ఫిబ్రవరి వచ్చే వరకు పలు ధఫాలుగా పత్తిని ఏరుతున్నారు. దీని వల్ల కూలీలు అధికం అవుతున్నాయి. దీంతో పాటు రసాయనాలు, పెల్టిలైజర్, కలుపు తీత ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. క్వింటాల్ పత్తిని ఏరేందుకు రూ. 200 వరకు కూలీకే పోతోంది. దీంతో రైతుకు మిగిలేది అరకొర లాభాలే ఉంటున్నాయి. ఈ అధిక సాంద్ర పద్దతి వల్ల ఒకే సారి పత్తి పంట చేతికి రావడంతో .. కూలీలు ఖర్చలు తప్పనున్నాయి. రసాయనాలు, ఎరువులు ఎక్కువ సార్లు వేయాల్సిన పని లేదు.

యాజమాన్య పద్దతులు కీలకం:

అధిక సాంద్ర పద్దతిలో సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తేనే.. దిగుబడి సరిగ్గా వస్తుంది. మొక్కల మధ్య దూరం 60-90 సెంటీ మీటర్ల దూరం బదులు 20 సెంటీ మీటర్లు, సాళ్ల మధ్య దూరం 100-120 సెంటీమీటర్లకు బదులు… 80 సెంటీమీటర్లకే పరిమితం కానుంది. దీంతో గతంలో మనకు కేవలం 7-8 క్వింటాళ్ల మద్య వచ్చే దిగుబడి 13-15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. దీంతో పాటు రసాయనాల వినియోగంపై ద్రుష్టిపెట్టాలి. ఎరువుల వాడకంలో జాగ్రత్తలు పాటిస్తే సరైన లాభాలు పొందవచ్చు. ఎకరాలకు 50కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, పొటాష్ ఉపయోగించాలి. పూత, 45 రోజులకు ఓ సారి మెటిక్వాట్ క్లోరైట్ ద్రావణం లీటర్ నీటికి 1.5 మిల్లీ లీటర్లు.. కాయ పెరుగుదశలో మరోసారి 60 రోజులకు లీటర్ లీటికి 5 మిల్లీ లీటర్లు.. మెటిక్వాట్ ద్రవాణం రెండు సార్లు ఇవ్వాలి. ఈ రసాయనం మొక్క పెరుగుదలను నియంత్రించడమే కాకుండా.. పూత, కాతకు ఉపయోగపడుతోంది. కలుపుకోసం అదనపు శ్రధ్ద అవసరం. నీటి పారుదల ఇచ్చి… వాతావరణం సహరిస్తే..25 క్వింటాళ్ల దిగుబడి సాధ్యం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version