తేజ ‘అహింస’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

-

ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు చిన్న కొడుకు, హీరో రానా తమ్ముడు అభిరామ దగ్గుబాటి హీరోగా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న సంగత మనకు తెలిసిందే. దర్శకుడు తేజ దర్శకత్వంలో.. అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో బాలీవుడ్‌ నుడు రజత్‌ బేడీ కీలక విలన్‌ పాత్రలో కనిపిస్తున్నారు. . అభిరామ్‌ కు జోడీగా గీతిక తివారీ నటిస్తోంది.

త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ తేదీని అనౌన్స్‌ చేయనున్నారు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై జెమిని కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

తేజ పుట్టిన రోజు నేపథ్యంలో.. అభిరామ్‌ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. అలానే సినిమాలోని హీరో, హీరోయిన్స్ తో పాటు పలు ఇతర ముఖ్య పాత్రల యొక్క ఆడియో వాయిస్ పోస్టర్స్ కూడా ఆకట్టుకోవడంతో ఆడియన్స్ లో అహింస మూవీ పై మరింత హైప్ ఏర్పడింది. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ ని అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తప్పకుండా అహింస మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుని మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది యూనిట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version