ఊబకాయం సమస్యతో ఈరోజుల్లో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది అయితే మనిషి సన్నగా ఉన్నప్పటికీ పొట్ట మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఇలా శరీర ఆకృతితో ఉద్యోగం చేసేవాళ్లు అసంతృప్తిగా ఉన్నారు. వీళ్లకు వ్యాయామాలు చేసే అంత టైమ్ ఉండదు. అలా అనీ స్ట్రిట్ డైట్ పాటించే అంత ఓపిక ఉండదు. అలాంటి వారికోసమే ఈ ఆర్టికల్.. కేవలం డిన్నర్ ఇలా ప్లాన్ చేసుకుని తింటే చాలు.. రిజల్ట్ వారంలోనే కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా అది అనుకుంటున్నారా..!!
పెసర పప్పు- బరువు తగ్గాలనుకుంటే రాత్రి భోజనంలో పెసర పప్పును చేర్చండి.. ఈ పప్పులో చాలా పోషకాలు ఉన్నాయి. ఇది మీ రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా బరువును సైతం తగ్గిస్తుంది. పెసర పప్పుతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే టేస్టీగా తింటూనే ఈజీగా బరువు తగ్గొచ్చు.
సగ్గుబియ్యం ఖిచిడి- సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. తినడానికి తేలికగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజూ రాత్రి భోజనంలో వీటిని తినవచ్చు. దీన్ని తినడానికి ఒక కప్పు సగ్గుబియ్యం కడిగి 6 గంటలు నానబెట్టండి. దీని తర్వాత గిన్నెలో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించండి. ఆ తర్వాత బంగాళదుంపలు, శెనగపప్పు, ఉప్పు, శనగలు, కొత్తిమీర వేసి ఉడికించాలి. ఆ తర్వాత నిమ్మకాయ పిండితో తినండి. ఇది ఎంతైన తినొచ్చు..ఈజీగా జీర్ణం అవుతుంది.
బొప్పాయి సలాడ్- బొప్పాయి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజూ రాత్రి భోజనంలో దీనిని తినడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బొప్పాయితో కడుపునిండుతుందా అనుకుంటారేమో.. బొప్పాయి సలడాన్‌ను చేసుకుని తినొచ్చు. ఇది ఎలా చేయాలో ఆన్‌లైన్‌లో చూస్తే సరి.!
కేవలం ఈ ముడింటిలో మీకు ఈజీగా ఉన్నదాన్ని ఒకటి ఎంచుకుని డైలీ నైట్ డిన్నర్‌లో తినండి. అంటే ఇది మాత్రమే డిన్నర్‌గా..మళ్లీ డిన్నర్ చేసి ఇవి వేరే తినడం అనుకుంటారేమో..!! వారం రోజుల్లో మీలో వచ్చే మార్పు మీరే గమనిస్తారు..