ఎయిమ్స్ డియోఘర్ జూనియ‌ర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. వివరాలివే..!

-

ఉద్యోగం కోసం మీరు చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు అప్లై చేసుకోచ్చు.

 

jobs

ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలని చూస్తే.. అక్టోబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అప్లై చేసుకోవడానికి అవకాశం వుంది. ఎటువంటి రాత ప‌రీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఆన్‌ లైన్ ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి సెలెక్ట్ చెయ్యడం జరుగుతుంది. జ‌న‌ర‌ల్ అండ్ ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.1000 ప‌రీక్ష ఫీజు. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఈడ‌బ్ల్యూఎస్‌, మ‌హిళ‌ల‌కు ప‌రీక్ష ఫీజు లేదు. ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. AIIMS Patna payable at Patna పేరున డీడీ తీయాలి.

ఇంట‌ర్వ్యూ నాటికి అభ్య‌ర్థి వ‌య‌సు 33 ఏళ్లు మించ‌కూడదు. అప్లై చేసుకోవాలని అనుకువాళ్ళు ప‌దో త‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్, ఎంబీబీఎస్ పాస్ స‌ర్టిఫికెట్‌, అనుభ‌వం సంబంధిత ధ్రువ‌ ప‌త్రాలు రెడీగా ఉంచుకోవాలి. ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్, అప్లికేష‌న్ విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ ను సంద‌ర్శించాలి.  https://www.aiimsdeoghar.edu.in/recruitments/list

Read more RELATED
Recommended to you

Exit mobile version