క్రైస్తవులకు సీఎం కేసీఆర్ శుభవార్త…క్రిస్మస్‌కు విందు, 2.15 లక్షల మందికి గిఫ్ట్ ప్యాక్‌లు

-

తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవులకు సీఎం కేసీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. క్రిస్మస్ పండుగ వస్తున్న నేపథ్యంలో క్రైస్తవులకు విందుతో పాటు బహుమతులు ఇచ్చేందుకు కేసిఆర్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఏకంగా 33 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చర్చి పరిధిలో 500 మంది చొప్పున మొత్తం 2.15 లక్షల మందికి గిఫ్ట్ ప్యాక్లను ఇవ్వనున్నారు. మరోవైపు విందుకోసం నియోజకవర్గానికి రెండు లక్షలు అలాగే జిహెచ్ఎంసిలో ఒక్కో ప్రాంతానికి లక్ష రూపాయలు ఖర్చు చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆటో ఎల్బీ స్టేడియంలో నిర్వహించే అధికారిక విందుకు 15వేల మంది రానున్నట్లు అంచనా వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version