ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ ఆపండం దేనికి సంకేతం!

-

భారత్ లో రోజు రోజుకీ పేరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒకవైపు.. దేశం ఆర్థికంగా ఎదుర్కోబోతున్న ఇబ్బందులు మరోవైపు.. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజల ఆరోగ్యం కంటే ఆర్ధిక పరిస్థితి ముఖ్యం కాదనే సంకేతాలు ప్రధాని మోడీ నుంచి వెలువడిన సంగతి! ఈ క్రమంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసేది ఎప్పుడు.. ప్రజలు తమ రొటీన్ లైఫ్ లోకి వచ్చేది ఎప్పుడు? అనే ప్రశ్నలకు అప్పుడప్పుడూ రైల్వే టికెట్ బుక్కింగ్స్ ఓపెన్ అయ్యాయి.. ఫ్లైట్ టికెట్ బుక్కింగ్స్ మొదలవుతున్నాయి.. వంటి వార్తలు చాలా మందికి ఆనందాలను కలిగిస్తుంటాయి!! అయితే ప్రస్తుతం వాటినీ ఆపేస్తున్నారు అనే వార్తలు… లాక్ డౌన్ పై మరింత సందేహాలను వ్యక్తపరుస్తున్నాయి!

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో మే 4వ తేదీ నుంచి దేశీయ రూట్లలో సర్వీసులు తిప్పుదామని భావించిన ఎయిర్ లైన్స్ సంస్థలు టికెట్ల బుకింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలపై తాజాగా డీజీసీఏ స్పందించింది. వారి ఆశలకు కళ్లెం వేస్తూ… తాము మళ్లీ ప్రకటన చేసేంతవరకు టికెట్ల బుకింగ్ లు నిలిపివేయాలని ఆదేశించింది! మే 4వ తేదీ నుంచి దేశీయ రూట్లలో విమాన ప్రయాణాలకు తాము ఇప్పటివరకూ ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని, ఎలాంటి అనుమతులూ మంజూరు చేయలేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఆయా సంస్థలు తొందరపడవద్దని… కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు ఆయా సంస్థలకు తగిన సమయం ఇస్తామని, ముందుగా సమాచారం అందజేస్తామని డీజీసీఏ వివరించింది.

దీంతో… లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు అనే అంశంపై మళ్లీ టెన్షన్ మొదలైంది! ప్రస్తుతం ఉన్న పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం… మే 3 న మళ్లీ ప్రధాని నుంచి మరో ప్రకటన వెలువడే అవకాశం ఉందని.. అది మే15 వరకూ కావొచ్చనే ఊహాగాణాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో రెండు మూడు రోజుల క్రితం రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఒక సమావేశం కూడా ప్రధానికి మే 15వరకూ ఉంటే మంచిదనే ఆలోచన చెప్పిన సంగతి ” మనలోకం.కాం” పాఠకులకు తెలిసిందే. కాబట్టి… మే 3 అనే విషయం మెంటల్ గా ఎవరూ ఫిక్సవకపోవడమే మంచిదన్నమాట! భార్య ఒకచోట, పిల్లలు ఒకచోట, భర్త మరోచోట ఉండిపోయాం ఇంతకాలం.. మే 4 తర్వాత అంతా కలవబోతున్నాం అని సంబర పడినవారికి ఇది చేదువార్తే అయినప్పటికీ…. దేశం ఆరోగ్యం ముందు మిగిలినవన్నీ చిన్న విషయాలే కదా!!

Read more RELATED
Recommended to you

Exit mobile version