దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విషయంలో అందరూ కూడా కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. చాలా తక్కువ కేసులు ఉండి దాదాపు వారం రోజుల నుంచి అసలు ఒక్క కేసు కూడా నమోదు కాని రాష్ట్రం గా ఉన్న ఓడిస్సా లో లాక్ డౌన్ ని చాలా సమర్ధవంతంగా అమలు చేస్తుంది అక్కడి ప్రభుత్వం. తెలంగాణా ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉండి లాక్ డౌన్ లో ఎలాంటి సడలింపు వద్దని స్పష్టం చేసింది.
అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేసే విషయంలో కేంద్రం ఇచ్చిన సూచనలను ఆయన అమలు చెయ్యాలని చూడటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడు కేసులు 600 పైగా ఉన్నాయి. ఇప్పుడు సడలిస్తే జనం రోడ్ల మీదకు వస్తారు. ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే ఇబ్బందే.
అటు ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో పలు సూచనలు చేస్తున్నారు. అనవసరంగా లాక్ డౌన్ ని సడలించవద్దు అనే సూచన రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నారు. జగన్ అసలు ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా పెట్టలేదు దీనికి సంబంధించి. దీనిపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే జగన్ వైఖరిపై అనేక విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో ఈ తరహా నిర్ణయం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.